భరత్ అనే నేను తర్వాత సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా లో మహేష్ హోటెల్ మేనేజర్ తో పాటుగా కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపిస్తాడట. అంతేకాదు సినిమాలో రైతుల గురించి పోరాడే వ్యక్తిగా కూడా మహేష్ కనిపిస్తాడని తెలుస్తుంది.
రైతుగా మహేష్ మహర్షి సినిమాలో ట్విస్ట్ అదిరిపోయింది. ఇప్పటికే సినిమా యూనిట్ వస్తున్న సమాచారం ప్రకాతం సినిమా అద్భుతంగా వస్తుందని అంటున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రైతుగా సర్ ప్రైజ్ చేస్తాడట.