దారుణం : మూడేళ్ళ బాలికను రేప్ చేసిన పన్నెండేళ్ళ బాలుడు

మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారికి రక్షణ దొరకడం లేదు. మూడేళ్ల చిన్నారి నుంచి పండు ముదుసలి దాకా కామానికి బలైపోతున్నారు. తాజాగా జార్ఖండ్‌ లో జరిగిన ఒక దారుణ ఘటన కలకలం రేపుతోంది. తూర్పు సింగ్‌ భూమ్ జిల్లాలో మూడేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులకి ఫిర్యాదు అందింది. నవంబర్ 4 న జరిగిన ఈ సంఘటన గురించి ఆ పాప తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

నమోదయిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, పార్సుడిహ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని లోకో కాలనీలో చిన్నారి తమ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో తన పొరుగు ఇంట్లో ఉండే పన్నెండేళ్ళ బాలుడు అత్యాచారం చేశాడు. నిందితుడిని మరియు అతని తండ్రిని పట్టుకోవటానికి ఒక స్పెషల్ మ్యాన్ హంట్ స్టార్ట్ చేశారు పోలీసులు. చిన్నారి తండ్రి వేరే ఊరిలో ఉన్నందున ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం అయిందని చేబుతున్నరు.