12th ఫెయిల్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన ఆనంద్ మహీంద్రా …..

-

విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన తాజా చిత్రం’12th ఫెయిల్’. ప్రముఖ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం పై ఇప్పటికే దీపికా పదుకోన్, అలియా భట్ వంటి వారు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీపై టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదిక తన రివ్యూ ఇచ్చాడు.ఈ సంవత్సరం ఒకే ఒక్క మూవీ చూడాలనుకుంటే ఈ మూవీనీ తప్పకుండా చూడండి అని ఆనంద్ మహీంద్రా సూచించారు. జాతీయ అవార్డు పొందడానికి కావాల్సిన అన్ని అర్హతలు యాక్టర్ విక్రాంత్ మస్సేకి ఉన్నాయని  ప్రశంసిస్తూ రివ్యూ ఇచ్చారు.

 

 

పేదరికాన్ని అధిగమించి మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ పాత్రలో నటించిన విక్రాంత్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు నటుడు విక్రాంత్ మస్సే స్పందిస్తూ…మీలాంటి గొప్పవారి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందని’ రిప్లై ఇచ్చారు. 2023 లో వచ్చిన బెస్ట్ మూవీ అంటూ నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news