తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణాకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్‌పై జరిగిన సీఈటీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖుల సమావేశంలో ప్రసంగించారు.నేను రైతు బిడ్డను.. వ్యవసాయం మా సంస్కృతి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు రైతుల కష్టాలు తెలుసని , భారత్ లో రైతులు ఆత్మహత్యలు ఒక పెద్ద సమస్య అని అసహనం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ రైతులకు పంటకు మద్దతు ధర కల్పించిందన్నారు.
వ్యవసాయం విషయంలో మోడ్రన్ టెక్నాలజీ రైతులకు అందుబాటులో లేదు అని ఆయన అన్నారు.వ్యవసాయ సాగుకు తాము రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరుతో రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.99 శాతం రైతుల ఆత్మహత్యలను అరికట్టాలని తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే రైతులు లాభాలు గడించేలా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభ్యులు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.