130 సరికొత్త ఎమోజీలు ప్రవేశపెట్టనున్న గూగుల్, యాపిల్ సంస్థలు..!

-

యాపిల్ గూగుల్ సంస్థలు జులై 17 వ తేదీన ప్రపంచ ఎమోజీల దినోత్సవం జరుపుకొని వినియోగదారులకు ఒక తీపి కబురు అందించింది. అదేంటంటే ఈ సంవత్సరం డిసెంబరు నెల లోపు రెండు కలిపి 130 సరికొత్త ఎమోజీలు ప్రవేశపెట్టనున్నాయి. గూగుల్ సంస్థ తమ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఎమోజి 13.0 ద్వారా ఆండ్రాయిడ్ 11 వెర్షన్ అప్డేట్ తో 117 సరికొత్త ఎమోజీలు విడుదల చేయనుంది.

emoji
emoji

 

యాపిల్ సంస్థ తమ ఐఓఎస్ వినియోగదారుల కోసం ఎమోజి 13.0 ద్వారా ios 14 అప్డేట్ పై 13 సరికొత్త ఎమోజీలు విడుదల చేయనున్నది. అయితే ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రాంకి ముందస్తుగానే సబ్స్క్రయిబ్ చేసుకున్న వినియోగదారులు ఈ సరికొత్త ఎమోజీ లను వినియోగించవచ్చు. 130 ఎమోజీల‌లో న‌వ్వుతున్న ముఖం, ఒక వీల్‌లో కూర్చున్న మ‌నిషి, కౌగిలించుకుంటున్న ఇద్దరు వ్యక్తులు, త‌క్సేడోలో మ‌హిళ‌లు, టీపాట్‌, బోబా టీ, ఫుడ్ గ్రెయిన్స్‌, లాంగ్ డ్ర‌మ్ వంటి ఎమోజీలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news