‘రెడీ’కి పధ్నాలుగేళ్లు..రామ్ పోతినేని, శ్రీను వైట్ల ఎమోషనల్ ట్వీట్

-

టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘రెడీ’ విడుదలై 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల, హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. దర్శకుడు శ్రీను..తాను బాగా ఎంజాయ్ చేసిన చిత్రం ‘రెడీ’ అని చెప్పాడు. స్క్రిప్ట్ దశ నుంచి మొదలుకుని విడుదల వరకు తాను ‘రెడీ’ ఫిల్మ్ హ్యాపీగా చేశానని, ఈ సినిమాకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా హీరో రామ్ కు, హీరోయిన్ జెనీలియా, ప్రొడ్యూసర్ శ్రవంతి రవి కిశోర్ కి థాంక్స్ చెప్పాడు.

#14YearsForReady ..ఫోర్టీన్ ఇయర్స్ ఫర్ రెడీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేస్తూ ఆ నాటి ఫొటోలు షేర్ చేశాడు దర్శకుడు. రామ్ పోతినేని కూడా ట్వీట్ చేశాడు. ‘జగడం’ తర్వాత తన వద్దకు వచ్చిన స్టోరి ‘రెడీ’ అని అది ఎప్పటికీ స్పెషలేనని చెప్పుకొచ్చాడు. దర్శకుడు శ్రీనువైట్లకు, తను వర్క్ చేసిన తొలి సూపర్ స్టార్ జెనీలియాకు థాంక్స్ చెప్పాడు.

రామ్ పోతినేని ప్రస్తుతం..తమిళ్ దర్శకుడు లింగు స్వామితో ‘ద వారియర్’ అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు రామ్. ఇక..దర్శకుడు శ్రీను వైట్ల..‘ఢీ’ కి సీక్వెల్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version