సైనికులను అవమానపరచడానికే ‘అగ్నిపథ్’: మహేశ్ కుమార్

-

రక్షణశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం.. సైనికులను అవమానపరచడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో వారు పాల్గొన్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపణ చేశారు.

మహేశ్ కుమార్ గౌడ్

కేంద్ర ప్రభుత్వం పెన్షన్, ఆర్థికభారం తగ్గించుకోవడానికి రక్షణశాఖను ఎంచుకుందని అన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన సైనికులను ఎంపిక చేసుకోవడం చూస్తుంటే.. దేశ పరిస్థితి ఎంత దిగజారుతుందో అర్థం అవుతుందన్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించడం సైనికులను అవమానపరచడమేనని ఆరోపించారు. దేశ సేవలో ముందుండే సైనికుల నోట్లో మట్టికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తం అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తోందని, ఆర్మీని రక్షించుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version