కరోనా కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది. చిన్న పని కూడా లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఎన్నో ఏళ్ళుగా ఆగకుండా పరుగెడుతున్న జీవితాలన్నీ ఒక్కసారిగా హఠాత్తుగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఐతే ఆ సమయంలో వారందరినీ సొంతఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా చాలామంది ఇండియాకి తిరిగొచ్చారు.
రాజ్యసభలో ప్రవేశపెట్టిన లెక్క ప్రకారం కరోనా కారణంగా మన దేశానికి తిరిగొచ్చిన వారు 14,12,835 మంది ఉన్నారట. వందే భారత్ మిషన్ కింద 56,874మంది ఇండియాకి వచ్చారు. వీరందరిలో 3,248 మంది కరోనా పాజిటివ్ గా గుర్తింపబడ్డారు. ఈ మేరకు రాష్ట్రమంత్రి (MoS) మురళీధరన్ వీటిని బయటపెట్టాడు. కోవిడ్ 19 నేపథ్యంలో సాగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఈ లెక్కలు చూపెట్టారు. ఈ వర్షాకాల సమావేశాలు అక్టోబర్ 1వ తేదీ వరకు జరగనున్నాయి.