నర్సింగ్‌ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు

-

నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో నర్సింగ్ కాలేజ్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. సూర్యపేటకు చెందిన భవాని స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు నల్లగొండ జిల్లా కేంద్రంలో పరీక్షలు రాయడానికి వెళ్తుండగా, నకిరేకల్ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

హైవే నుండి నల్గొండ వైపు రోడ్డు టర్న్ తీసుకుంటుండగా ఎదురుగా లారీ రావడంతో అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి నర్సింగ్ స్కూల్ బస్ అతి వేగం కారణంగా భావిస్తున్నారు.

గాయపడ్డ వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ స్కూల్ బస్సులో ఆక్యుపెన్సి కి మంచి విద్యార్థినులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదఘటనపై మంత్రి హరీష్ రావు ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు హరీష్‌ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news