రేవంత్‌కు కొండా ఫ్యామిలీ షాక్? రూట్ మారుస్తారా?

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికలని ధీటుగా ఎదురుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం సరికొత్త టీంని ఎంపిక చేసింది.  24 మంది ఉపాధ్యక్షులు, 84 మంది ప్రధాన కార్యదర్శులు, 40 మంది ఎగ్జిక్యూటివ్‌ సభ్యులతో జంబో కార్యవర్గాన్ని నియమించింది. దీంతోపాటు 18 మంది సభ్యులు, నలుగురు ఆహ్వానితులతో నూతన రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అలాగే 26 డీసీసీలకు అధ్యక్షులనూ నియమించింది.

అయితే ఇందులో సీనియర్ నాయకురాలైన కొండా సురేఖని..ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు. దీనిపై ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు బహిరంగ లేఖ కూడా రాశారు. తెలంగాణ పోలిటికల్ ఎఫైర్స్‌లో తన పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్థాపం కలిగించిందని వెల్లడించారు.

అసలు పొలిటికల్ ఎఫైర్స్‌లో తన కంటే జూనియర్లను నామినేట్ చేశారని, తనని మాత్రం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం ముఖ్యమని, సామాన్య కార్యకర్త లాగే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అయితే కేవలం సురేఖ తన పదవి గురించే కాదు..స్థానిక రాజకీయాల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లా డి‌సి‌సి అధ్యక్ష పదవి కొండా మురళి ట్రై చేసినట్లు తెలిసింది. అటు జనగాం డి‌సి‌సి అధ్యక్ష పదవి కోసం జంగా రాఘవరెడ్డికి వచ్చేలా కొండా ఫ్యామిలీ ట్రై చేస్తుంది.

అయితే ఈ విషయాల్లో కొండా సిఫార్సులని అధిష్టానం పట్టించుకున్నట్లు కనిపించలేదు. అందుకే ఆమె సురేఖ మనస్తాపం చెంది రేవంత్‌కు లేఖ రాశారు. ఇదే సమయంలో కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారా? అనే ప్రచారం కూడా వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో కొండా ఫ్యామిలీ పార్టీ మార్పుపై ఎలాంటి ఆలోచన చేయట్లేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news