దేశంలో అనేక చోట్ల జరుగుతున్న పురావస్తు శాఖ పరిశోధనల్లో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. ఒక్కోసారి ఏన్నో ఏళ్ల నాటి విగ్రహాలు సైతం బయట పడుతుంటాయి. తాజాగా తమిళనాడులో అరుదైన గణనాథుడి విగ్రహం బయటపడింది.
ఆ రాష్ట్రంలోని శ్రీముష్ణం సమీపంలోని నీటిపారుదల కాలువలో పురాతన కాలం నాటి గణేశుని విగ్రహాన్ని మత్స్యకారులు కనుగొన్నారు. దీనిని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు సుమారు 150 ఏళ్ల నాటి క్రితం నాటిదని తేల్చారు. నీరు పారుదల కాలువలో నీటి ప్రవాహం కారణంగా బురద మొత్తం కొట్టుకుని పోగా విగ్రహం బయటపడినట్లు మత్స్యకారులు చెబుతున్నారు.ప్రస్తుతం దాని మీద పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
150 ఏళ్ల నాటి గణేశుని విగ్రహం
తమిళనాడు శ్రీముష్ణం సమీపంలోని నీటిపారుదల కాలువలో మత్స్యకారులు కనుగొన్న సుమారు 150 ఏళ్ల నాటి గణేశుని విగ్రహం. pic.twitter.com/rIwMIPh7mK
— ChotaNews (@ChotaNewsTelugu) December 7, 2024