Anam Venkataramana Reddy: టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉంది అంటూ బాంబ్ పేల్చారు ఆనం వెంకటరమణా రెడ్డి. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలను వెలికితీస్తున్న సీఎం చంద్రబాబుకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని వివరించారు.
కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటాను ఎకరాకు రూ.29 వేల చొప్పున్న లాక్కోవడం వెనుక ఆంతర్యం ఏంటో వైసీపీ నేతలు చెప్పాలని ఆనం డిమాండ్ చేశారు.