సీనియర్‌ సిటిజన్లకు పన్ను రాయితీ మినహాయింపు..!

-

సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు ఐటీ చట్టం ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తుంది. కేవలం రెసిడెంట్‌ సీనియర్‌  సిటిజన్లకు మాత్రమే ఈ ప్రయోజనాలను అందుబాటులో ఉంచింది. మరి అవేంటో తెలుసుకుందామా..

 

tax reduced to the senir citizen

 

ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం 60 నుంచి 80 ఏండ్లలోపు వయసున్నవారిని సీనియర్‌ సిటిజన్లుగా.. 80 ఏండ్ల కంటే ఎక్కువ వయసున్నవారిని సూపర్‌ సీనియర్‌ సిటిజన్లుగా అధికారులు వర్గీకరించారు. అధిక మినహాయింపు పరిమితి మొదలుకుని డిడక్షన్ల దాకా వీరికి ఎన్నో ప్రయోజనాలను అందుబాటులో ఉంచింది.

సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోలిస్తే సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు పన్ను మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సీనియర్‌ సిటిజన్లకు పన్ను మినహాయింపు రూ.3 లక్షలుగా, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు రూ.5 లక్షలుగా ఉన్నది. అంటే సీనియర్‌ సిటిజన్లకు రూ.50 వేలు, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు రూ.2.25 లక్షల మేరకు అదనపు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా పెన్షన్‌ ఆదాయ ఖాతాపై రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పొందేందుకు సీనియర్‌ సిటిజన్లను అనుమతిస్తున్నారు.

ఆదాయ పన్ను చట్టంలోని 208వ సెక్షన్‌ ప్రకారం.. వృత్తిపరంగా ఎలాంటి రాబడి లేని సీనియర్‌ సిటిజన్లు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను చెల్లించనక్కర్లేదు.

ఆధునిక సాంకేతికతపై అవగాహన లేని వృద్ధులు తమ ఐటీ రిటర్నులను పేపర్‌ మోడ్‌లో దాఖలు చేసుకునేందుకు వీలున్నది.

బ్యాంక్‌ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయంపై వడ్డీ (80టీటీబీ): సేవింగ్స్‌ డిపాజిట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రూ.50 వేల వరకు ఆర్జించే సీనియర్‌ సిటిజన్లు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80టీటీబీ కింద పన్ను మినహాయింపునకు అర్హులు. ఇలాంటివారికి ఎలాంటి డిడక్షన్‌ ఉండదు.

బీమా ప్రీమియం చెల్లింపు (80డీ): ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఒక సంవత్సరంలో రూ.50 వేల వరకు ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లించే సీనియర్‌ సిటిజన్లను సెక్షన్‌ 80డీ కింద ఆ మొత్తాన్ని డిడక్షన్‌గా క్లెయిమ్‌ చేసుకునేందుకు అనుమతిస్తారు.

వైద్య చికిత్స (80డీడీబీ): పన్ను చెల్లిస్తున్న సీనియర్‌ సిటిజన్లు కొన్ని రకాల వ్యాధులకు చికిత్స పొందేందుకు అయిన ఖర్చుల్లో రూ.లక్ష వరకు పన్ను డిడక్షన్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version