పాన్ ఇండియా ఫిలిం పుష్పను మాధవన్ అందుకే వదిలేశాడా..?

-

హీరో మాధవన్ తెలుగు సినిమాలు చేయడానికి ఎందుకు జంకుతున్నాడు.చేసిన రెండు నెగిటివ్ రోల్స్ ..
ఎక్కడా గుడ్ విల్ తేకపోవడంతో మనోడు తెలుగు సినిమాను టోటల్ గా లైట్ తీసుకున్నాడు.చివరకు సెట్స్ మీదున్న పాన్ ఇండియా ఫిలింకు నో చెప్పేసాడు.ఈ 50ఏళ్ల అరవ హీరో టాలీవుడ్ అంటే ఎందుకు వర్రీ అవుతున్నాడు.

సఖి ఫేం కోలీవుడ్ హీరో మాధవన్… తెలుగు సినిమాలతో టాలీవుడ్లో మార్కెట్ కొట్టాలని ట్రై చేశాడు.సవ్యసాచి ,నిశ్శబ్ధం లాంటి సినిమాలు తనకు మంచి పేరు తెస్తాయని ఆశపడ్డాడు.తీరా సినిమాలు రిలీజ్ అయ్యాక రెండు ఫ్లాప్ లు కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్లిపోయాడు.

సవ్యసాచి,నిశ్శబ్దంలో నెగిటివ్ షేడ్ పాత్రలు పోషించినప్పటికీ ఏవి అంతగా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు.ముందుగా దర్శకులు చెప్పిన దానికి తీరా సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన అవుట్ పుట్ కు ఎక్కడా పొంతనలేదు.అంటే మాధవన్ కు మన దర్శకులు చెబుతున్నదానికి తెరపై చూపిస్తున్న దానికి సంబందమే లేదు.ఇదే మాధవన్ ను తెలుగు దర్శకులు అంటే భయపడేలా చేసింది.

రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్పలోను ప్రతినాయకుడు పాత్రకు ఆఫర్ ఇస్తే సున్నితంగా తిరస్కరించాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో మంచి రెమ్యనరేషన్ ఇస్తామని మేకర్స్ చెప్పినా నో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.ఒక విధంగా చెప్పాలంటే మన దర్శకుల మీద నమ్మకం లేదనే విషయాన్ని డైరెక్ట్ గానే చెప్పేశాడు.దీంతో తెలుగులో మాధవన్ కు ఆల్టర్ నేటివ్ గా కనిపించే ఆర్టిస్ట్ ల కోసం వేట మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version