ఎవరెస్టు పర్వతం ఎత్తు పెరిగిందంటా..!

-

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏంటని అడిగితే ఎవరెస్టు అంటారు. అయితే మరి ఆ ఎవరెస్టు ఎత్తు పెరిగిందంటే నమ్ముతారా.. నిజమండీ ఇది వరకటికన్నా ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరిగిందని నేపాల్​ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు. మరి దాని ప్రస్తుత ఎత్తు ఎంతో తెలుసుకుందామా…
ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎత్తు మారిందని ఆ దేశ విదేశాంగ మంత్రి కొత్త‌గా ప్ర‌క‌టించారు.  మౌంట్ ఎవ‌రెస్ట్ 8848.86 మీట‌ర్లు ఉన్న‌ట్లు నేపాల్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప్రపంచంలో ఇదే అత్యంత ఎత్తు అయిన ప్ర‌దేశ‌మ‌ని పలు దేశ అధికారులు ప్ర‌క‌టించారు.  అయితే ఎవ‌రెస్ట్ ఎత్తు సుమారు 86 సెంటీమీట‌ర్లు పెరిగిన‌ట్లు తెలిపారు. అయితే నేపాలీలు ప‌ర్వ‌త శిఖరాన్ని సాగ‌ర్‌మ‌తా జుములంగామా అని పిలుస్తారు.

ఆ ప‌ర్వ‌తం ఎత్తు పెరిగిన‌ట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ప్ర‌దీప్ గ‌యావాలీ ఖాట్మండులో జరిగిన సమావేశంలో ప్ర‌క‌టించారు. చైనా మంత్రి వాంగ్ యూ కూడా ఈ వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

2015లో నేపాల్‌ను నేల‌మ‌ట్టం చేసిన భూకంపం వ‌ల్ల .. ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎత్తు పెరిగిందా లేక త‌గ్గిందా అన్న అనుమానాల మేరకు దాని ఎత్తును లెక్కించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో నేపాల్ ప్ర‌భుత్వం మౌంట్ ఎవ‌రెస్ట్ ఎత్తును లెక్కించింది. నేపాలీతో పాటు చైనీస్ స‌ర్వేయ‌ర్లు కూడా ఈ కొల‌త‌ల కార్యక్రమాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 11వ తేదీన అంత‌ర్జాతీయ మౌంటేన్ డే నిర్వ‌హించనున్నారు. ఈమేరకు మూడు రోజుల ముందే ఈ ప్ర‌క‌ట‌న వెలువడిన‌ట్లు తెలుస్తోంది.

1955 నుంచి మౌంట్ ఎవ‌రెస్ట్ పర్వతం ఎత్తును లెక్కిస్తూ వస్తున్నారు. కాగా దాని ఎత్తును అప్పటి నుంచి సుమారుగా 8,848(29,028 ఫీట్లు) మీట‌ర్లుగా గుర్తిస్తున్నారు. కాగా ఇటీవల సంవభించిన అనేక ప్రకృతి  విపత్తుల వల్ల, కొవిడ్ వ‌ల్ల ఎవ‌రెస్ట్ శిఖరం ఎత్తుపై ప్ర‌క‌ట‌నలో ఆల‌స్యం జ‌రిగిన‌ట్లు నేపాల్​ దేశ మంత్రులు, అధికారులు వెల్లడించారు. కాగా ఈనెల 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news