ఈ మధ్య కాలంలో చాలా మంది అనేక రకాల స్కీములలో డబ్బులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేరుగా పోస్టాల్ పేమెంట్స్ బ్యాంకును నడుపుతోంది. డబ్బు సురక్షితంగానే ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ కూడా.
రూ.100 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలికంగా పెద్ద మొత్తంలో ఫండ్‌ను తయారు చెయ్యచ్చు. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. జనవరి 1, 2023 నుండి పోస్టాఫీసు RD వార్షికంగా 5.8 శాతం వడ్డీని పొందుతోంది. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఐదు సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. ఐదేళ్లకి ఒకసారి పొడిగించవచ్చు.
నెలవారీ రూ. 10,000 డిపాజిట్‌తో రాబోయే 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలలో, భారీ గ్యారెంటీ కార్పస్ ని పొందొచ్చు. 100 రూపాయల నుండి రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడి మొదలు పెట్టచ్చు.
గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఎంతైనా పెట్టచ్చు. ఆర్డీలో ఏటా 5.8 శాతం వడ్డీ లభిస్తుంది.
నెలవారీ పథకంలో ప్రతి నెలా 10,000 డిపాజిట్ చేస్తే, 5 సంవత్సరాలకి రూ.6,96,968 హామీ ఫండ్ వస్తుంది. మీ పెట్టుబడి రూ.6 లక్షలు అవుతుంది.
వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.96,968గా ఉంటుంది. నెలవారీ పథకంలో ప్రతి నెలా రూ. 10,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మరో 5 సంవత్సరాల పాటు పొడిగిస్తే 10 సంవత్సరాల తర్వాత రూ.16,26,476 హామీ ఫండ్ ఉంటుంది. దీనిలో మీ పెట్టుబడి రూ.12 లక్షలు, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.4,26,476. కావాలంటే సింగిల్ గా కాకుండా ముగ్గురితో ఉమ్మడి ఖాతా తెరవవచ్చు. రుణం కూడా తీసుకోవచ్చు.