రాష్ట్రంలో మరో 1,721 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్

-

మరో 1,721 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ జిల్లా కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ కోర్టుల నిర్వహణకు 1,721 పోస్టులను మంజూరు చేశామన్నారు. రూ.1050కోట్ల అంచనా వ్యయంతో కోర్టు భవనాల నిర్మాణం చేపడుతామని చెప్పారు. సత్వర న్యాయం కోసం జిల్లా కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఉద్యోగుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. కాంట్రాక్ట్‌ వ్యవస్థకు చరమగీతం పాడింది. కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం అమలుకు నిర్ణయించింది. కొత్త ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకే 95 శాతం అమలు చేస్తోంది. రాష్ట్ర పాలనలో..సంక్షేమ ఫలాలు అందించటంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయం నుంచి ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాల అమల్లోనూ వారిదే కీలక భూమిక. దీంతో..వారికి గుర్తింపు ఇస్తూ వేతనాలు..సంక్షేమం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నవారిగా గుర్తింపు పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version