ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..వారందరికీ ఉచితంగా 1,750 బైకులు

-

ఏపీలోని జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం 1,750 మూడు చక్రాల బైక్ లు ఉచితంగా అందించనుంది. అసెంబ్లీ నియోజకవర్గానికి 10 చొప్పున ఈ వాహనాలను కేటాయించారు.

డిసెంబర్ 3న వీటిని పంపిణీ చేయనున్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి నిబంధనలను కూడా సరళతరం చేశారు. గతంలో 80% వైకల్యం ఉంటేనే వాహనాన్ని ఇవ్వగా, జగన్ ప్రభుత్వం దానిని 70 శాతానికి తగ్గించింది.

అంతేకాదు వయోపరిమితిలో కూడా సడలింపులు చేశారు. ఈ నిర్ణయాలతో మరింత మందికి లబ్ధి చేకూరానుంది. వాహనాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు 5,743 దరఖాస్తులు రాగా, వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version