18 పేజెస్‌ రోటీన్ లవ్ స్టోరీ కాదు!థ్రిల్లింగ్ మూవీ

-

నిఖిల్ హీరోగా అనుపమా పరమేశ్వరన్‌  హీరోయిన్ గా  ’18 పేజెస్‌’. సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. దిగ్గజ  దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ వచ్చి సందడి చేసాడు.

దీనితో మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే నితిన్ కార్తికేయ 2, సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా యూనిట్ కూడా ప్రామోషన్స్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. రీసెంట్ గా విలేకర్ల సమావేశంలో పాల్గొన్న డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్‌ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. రొటీన్‌ లవ్‌స్టోరీ కాదని ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఇందులోని క్యారెక్టర్స్‌తో చూసి అనుభూతి చెందుతారు. సినిమా థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా లో  నిఖిల్, అనుపమ అద్భుతంగా నటించారు

తన గురువు సుకుమార్ గురించి మాట్లాడుతూ.. నా మొదటి సినిమా”కుమారి 21ఎఫ్‌’ చిత్రం తర్వాత చాలాగ్యాప్వచ్చింది.’కుమారి 21ఎఫ్‌’ తర్వాత రైటింగ్‌ గురించి ఇంకా నేర్చుకోవాలని నా గురువు సుకుమార్‌గారి దగ్గర చేరాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయితే దర్శకుడిగా ఇక నాకు గ్యాప్‌ ఉండకూడదని వరసగా సినిమాలు కమిట్ మెంట్ అయ్యాను. అందులో మైత్రి మూవీస్ వారిది కూడా ఉంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news