వారి సాయం కోరుతున్న పాకిస్తాన్..!

-

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి‌పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు అశాంతి సృష్టిస్తున్న నేపథ్యంలో, భారత్ తన చర్యలను మరింత కఠినంగా తీసుకుంటున్నది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పాకిస్తాన్‌ని కలవరానికి గురిచేస్తోంది. ఆ దేశం మీద సైనిక చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులు, అంతర్గత సమస్యలు, మరియు ఆర్మీలో ఉన్న గ్రూపుల ఆధిపత్యం అన్ని ఇలాంటి సమయాల్లో ఆ దేశానికి ప్రతికూలంగా నిలుస్తున్నాయి.

మంగళవారం జరిగిన పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. ఈ ఘటనపై పాకిస్తాన్ దారుణమైన విధంగా స్పందిస్తోంది, కాగా ఆ దేశం యుద్ధానికి దారితీసే చర్యలు తీసుకోవడాన్ని నివారించేందుకు రష్యా, చైనా సాయం కోరుతోందని తెలుస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, రష్యా మీడియాతో మాట్లాడుతూ, రష్యా మరియు చైనా ఈ సమయంలో సానుకూల పాత్ర పోషించగలవని పేర్కొన్నారు. భారత్ చేసిన వ్యాఖ్యలు నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు అంతర్జాతీయ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయవచ్చని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై పాకిస్తాన్ ప్రధాని మరియు ఉపప్రధాని కూడా స్పందించారు. పాకిస్తాన్ ఉపప్రధాని ఇషాక్ దార్, పహల్గామ్ దాడిని స్వాతంత్ర్య యోధులు చేశారు అని పేర్కొన్నారు. పాకిస్తాన్ వారిచ్చిన వ్యాఖ్యలు ఆధారాలు లేని ప్రకటనలేనని, ఆధారాలు లేకుండా పాకిస్తాన్‌పై ఆరోపణలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news