వరంగల్‌లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా కేసీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, వారి అనవసర చర్యలను ప్రస్తావించారు. అయితే ఈనేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి నిర్మాణాత్మక సూచనలు వస్తాయని ఆశించామని, కానీ ఆయన మనస్సు విషపూరిత విమర్శలతో నిండి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విలన్‌గా చిత్రీకరించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చూపించడం సమంజసం కాదని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.