షాకింగ్: పబ్ జీ వలన 18 ఏళ్ళ విద్యార్ధికి గుండెపోటు…!

-

పబ్ జీ… ఇది ఒక పిచ్చి జనాలకు. ముఖ్యంగా యువత దానికి ఎక్కువగా బాసిన అయిపోయిన పరిస్థితి ఉంది మన దేశంలో. ఇది కొంత మంది మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. తాజాగా పబ్ జీ గేమ్ టెన్షన్ తో విద్యార్ది మృతి చెందాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కిణిజేటి చేనేతపురి లో నివాసం ఉండే 18 ఏళ్ళ ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్ధి వంగర మురళీ కరోనా టెన్షన్ తో గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయారు.

కాలేజి లేకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి పబ్ జీ కి అతను బానిస అయిపోయాడు. అప్పటి నుంచి కూడా అతను చదువు పూర్తిగా పక్కన పెట్టేసి పబ్ జీ లోనే నిమగ్నం అయిపోయాడు. అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఆటలో టెన్షన్ హ్యాండిల్ చేయలేని విద్యార్ధికి గుండెపోటు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆన్ లైన్ క్లాసులు జరిగిన తర్వాత పిల్లాలను ఫోన్ కి దూరంగా ఉంచాలి అని సూచిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version