కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. కరోనా దెబ్బకు ఇప్పుడు వ్యాక్సిన్ మినహా మరో మార్గం లేదు అని చాలా మంది అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్తుంది. కరోనాకు వ్యాక్సిన్ రాకపోతే మాత్రం కాస్త కష్టమే అని చెప్తూ వస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ నేపధ్యంలోనే రష్యా, చైనా ఇటలీ, అమెరికా, భారత్ వంటి దేశాలు కరోనా వ్యాక్సిన్ పై దృష్టి పెట్టాయి.
భారత్ లో కరోనా వ్యాక్సిన్ ని ఇప్పుడు హైదరాబాద్ జినోమ్ వ్యాలీ కేంద్రంగా పని చేసే భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. దీనికి నిమ్స్ సహా దేశంలో 12 ప్రాంతాల్లో ట్రయల్స్ చేస్తున్నారు. దీనిపై నిమ్స్ కీలక ప్రకటన చేసింది. నిమ్స్ లో ఫేజ్ వన్ క్లినికల్ ట్రైల్స్ ముగిసాయి. 60 మంది వాలంటీర్ లకు కోవాక్సిన్ ను ఇచ్చిన నిమ్స్ బృందం… అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తామని చెప్తుంది.
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]