మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యండి. ఈ నోటిఫికేషన్ ద్వారా 183 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులని భర్తీ చేస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే ..
వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, లోకో అటెండెంట్, అటెండెంట్, మార్కెటింగ్ పోస్టులను భర్తీ చేస్తారు. అప్లై నవంబర్ 10 ఆఖరి తేదీ. ఆన్ లైన్ కంప్యూటర్ బెస్ట్ పరీక్ష సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సంబంధిత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కుల తో గ్రాడ్యుయేషన్ , ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అప్లై చేసుకోచ్చు.
వయస్సు వచ్చేసి 2021 సెప్టెంబర్ 30 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. జూనియర్ ఇంజినీర్ ప్రొడక్షన్ 87, ఇన్స్ట్రుమెంటేషన్ 15, ఎలక్ట్రికల్ 7, లోకో అటెండెంట్ 23, అటెండెంట్ ఫిట్టర్ 17, ఎలక్ట్రికల్ అటెండెంట్ 19, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 15.
ఎంపికైన వారికి దాదాపు రూ. 20,000 నుంచి రూ. 50,000 మధ్య నెలవారీ జీతం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్, ఓబీసీ ,ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. www.nationalfertilizers.com వెబ్సైట్ ద్వారా అప్లై చెయ్యచ్చు.
ఎంట్రాన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా ?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా .. అయితే Manalokam యొక్క Vijayapatham.com వెబ్సైట్లో ప్రాక్టీస్ బిట్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్ను పెంచుకోండి. మరరెన్నో ఇంట్రెస్టింగ్, వింత హౌసింగ్ విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనా సమాచారంకం.కామ్ ని ఫాలో అవ్వండి.