F3 Movie : సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3. 2019 సంక్రాంతికి విడుదలైన ఎఫ్ 2 మూవీ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజ్ వ్యవహరిస్తున్నారు. ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఎఫ్ 3 మూవీ ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఇక సినిమా లో… కూడా హీరోయిన్లుగా తమన్నా మరియు మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3 సినిమా నుంచి ఓ బిగ్‌ అప్ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ను పిబ్రవరి 25 వ తేదీన.. శివరాత్రి కానుకగా కానుకంగా విడుదల చేయనుంది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్రం. మొదట్లో సంక్రాంత్రి కి విడుదల చేయాలని భావించినా… చివరికి ఫిబ్రవరి 25 వ తేదీని లాక్‌ చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news