అలర్ట్‌.. న్యూయర్‌ వేడుకల బందోబస్తుకు రంగంలోకి 18వేల మంది పోలీసులు

-

ఈ ఏడాది న్యూయర్‌ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. అయితే.. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో భద్రత కల్పించేందుకు 18వేల బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మేరకు నగరంలో 125 చోట్ల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నూతన సంవత్సరం సందర్భంగా 657 చలాన్‌లు జారీ చేయగా, అందులో 36 మంది మద్యం తాగి వాహనాలు నడిపినందుకు సంబంధించినవని ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

శనివారం రాత్రి 8 గంటల నుంచి కన్నాట్‌ ప్లేస్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని తనిఖీ చేసేందుకు ఆల్కోమీటర్‌లను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పోలీస్‌ కమిషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌) దేవేంద్ర పాఠక్‌ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా భద్రత ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. శనివారం నగరవ్యాప్తంగా 16,500 మంది సిబ్బందిని పోలీసు బలగాలను, మరో 20కిపైగా కంపెనీలను మోహరించనున్నట్లు వివరించారు. మహిళా భద్రతపై పోలీసుల దృష్టి కేంద్రీకరిస్తామని, నగరంలో 2,500 మందికి పైగా మహిళా సిబ్బందిని మోహరిస్తామని పాఠక్ చెప్పారు.

తనిఖీల కోసం 1,600 పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1,200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, 2,074 మోటార్‌బైక్‌లు బలగాలు ఉంటాయని వివరించారు. స్పెషల్ కమిషనర్‌ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ మాట్లాడుతూ జాయింట్ చెకింగ్ కోసం స్థానిక పోలీసు సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసుల నుంచి దాదాపు 1,850 మంది సిబ్బందిని మోహరించనున్నట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 125 పాయింట్లను గుర్తించామని, కన్నాట్ ప్లేస్‌లోకి ప్రవేశించడానికి ట్రాఫిక్ పరిమితం చేయనున్నట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version