2022 : భారీ నష్టాలు తెచ్చిన సినిమాలు.. ఎన్ని కోట్లు నష్టమంటే..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో విడుదలకు ముందు భారీ అంచనాలు ఉండి.. విడుదల తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సినిమాలు చాలానే విడుదలయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ రొటీన్ గా ఉంటే మాత్రం ఎంతటి స్టార్ హీరోలైనా సరే సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాల ఫలితాలను గమనిస్తే నిర్మాతలకు భారీ నష్టాలను కలిగించాయి వాటి గురించి తెలుసుకుందాం.

ఏడాది మొత్తంగా అత్యధిక స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాల విషయానికి వెళ్తే.. ముందుగా భారీ అంచనాల మధ్య విడుదలైన రాధే శ్యామ్ సినిమా డిస్ట్రిబ్యూటర్లను భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా దాదాపుగా రూ.110 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లుగా సమాచారం. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఆచార్య. ఈ సినిమా మొదటి రోజే డివైడె టాక్ ను తెచ్చుకొని అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఈ సినిమాకి దాదాపుగా రూ.90 కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ,పూరి కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమా కూడా దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.

లైగర్ సినిమా దాదాపుగా రూ.62 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లుగా సమాచారం. హీరో రామ్ పోతినేని నటించిన దివారియర్ చిత్రం కూడా ఈ ఏడాది నష్టాలనే మిగిల్చింది. ఈ చిత్రం దాదాపుగా రూ. 18 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లుగా సమాచారం. అలాగే నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రూ.17 కోట్ల నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. అలాగే నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా దాదాపుగా రూ.20 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం. ఇది ఏడాది అత్యధిక నష్టాలను మిగిల్చిన చిత్రాలు ఇవే.

Read more RELATED
Recommended to you

Exit mobile version