ఈరోజుటి తో 2022 సంవత్సరం పూర్తి కాబోతోంది. కొత్త ఏడాది కొత్త రెజల్యూషన్స్ తో ఎంతోమంది తమ కెరియర్ ను అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2022 సంవత్సరం కొంతమందికి అందమైన జీవితాన్ని ప్రసాదిస్తే మరికొంతమందికి దుర్భరమైన జీవితాన్ని ప్రసాదించింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో ఈ విషయం బాగా వర్తిస్తుందని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ ఏడాది కొంతమంది సినిమాల ద్వారా భారీ పాపులారాటీని దక్కించుకుంటే.. మరికొంతమంది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. మరి వారెవరో ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
ఈ ఏడాది పవిత్ర లోకేష్ , నరేష్ ఎన్నో వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం గమనార్హం. పవిత్ర కొన్ని రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అలాగే చిరంజీవి, గరికపాటి వివాదం ద్వారా చిరంజీవి అలాగే గరికపాటి కూడా వార్తల్లో నిలిచారు. ఈ వివాదం లో ఎక్కువ మంది గరికపాటిని తప్పు పట్టడం గమనార్హం.
మరొకవైపు యాంకర్ అనసూయ పై కూడా చాలామంది ఆంటీ అంటూ నెగిటివ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. దీంతో సీరియస్ అయిన ఈమె పోలీసులను కూడా ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేశారు.
ఏడాది ఆది పురుష్ సినిమా కూడా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పై చాలామంది విమర్శలు చేశారు. అలాగే ఈ ఏడాది విడుదలైన లైగర్ సినిమా పెట్టుబడుల విషయంలో ఈడి పూరీ జగన్నాథ్, ఛార్మీ, విజయ్ దేవరకొండ లను కూడా విచారించింది.
వీరితోపాటు నయనతార , విశ్వక్సేన్ , రష్మిక, రాంగోపాల్ వర్మ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.. అలాగే నాగార్జున కూడా బిగ్ బాస్ షో ద్వారా పూర్తిస్థాయిలో విమర్శల్లో మునిగిపోయాడు. ఇలా వీరంతా 2022లో విమర్శలు ఎదుర్కొని వార్తల్లో నిలిచారు . మరి కొత్త ఏడాది కొత్త జీవితాన్ని సాఫీగా కొనసాగించాలని ఆయా సెలబ్రిటీల అభిమానులు కోరుకుంటున్నారు.