2023: విజయ్ దళపతి నికర ఆస్తుల విలువ ఎంతంటే..?

-

ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈయన నటించిన వారసుడు సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై థియేటర్లలో పర్వాలేదు అనిపించుకుంది. ముఖ్యంగా తెలుగు , తమిళ్ సినీ ఇండస్ట్రీలతో పాటు విదేశాలలో కూడా భారీ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరో కూడా ఈయనే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న హీరోగా కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఇన్ని సంవత్సరాలు.. ఆయన పారితోషకాల ద్వారా అలాగే ప్రకటనల ద్వారా ఎంత కూడబెట్టారు? ఆయన సంపద ఎంత ? అనేది ఆరా తీస్తే కొన్ని వందల కోట్లు ఆయన సొంతం అన్నట్లుగా తెలుస్తోంది.

రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్న విజయ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. కోలీవుడ్లో నమ్మదగిన నటుడిగా హవా కొనసాగిస్తున్నాడు. అంతేకాదు ఎల్లలు దాటి మరీ అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా కూడా గణనీయమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. బహుశా అల్లు అర్జున్ కాకుండా కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక మలయాళీయేతర నటుడు విజయ్ మాత్రమే. వాస్తవానికి విజయ్ థ్రిల్లర్ చిత్రం తేరి కేరళలో భారీ విజయాన్ని సాధించింది. అందుకే ఈయనకు అక్కడ భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇకపోతే ప్రస్తుతం ఈయన ఆస్తుల విలువ సుమారుగా రూ.450 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అంతేకాదు అనేకమైన అత్యంత ఖరీదైన కార్లు, ఆస్తులు కూడా ఉన్నాయట. పలు బ్రాండ్ల ద్వారా ప్రతి ఏడాది రూ. 10 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. అలాగే అంతర్జాతీయ బ్రాండ్లకు, క్రీడా బృందాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక విజయ్ దళపతి ఆస్తులు విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version