బారాస కి 21 మంది కౌన్సిలెర్లు రాజీనామా.. ఇదేం ట్విస్టు..?

-

బెల్లంపల్లి పుర రాజకీయంలో మలుపు తిరిగింది. 21 మంది కౌన్సిలర్లు బారాస కి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం కలకలం రేపుతోంది. అయితే 19 మంది సంతకాలు చేసి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కి రాజీనామా లేఖ ని పంపించారట సంతకాలు చేయనప్పటికీ వైస్ చైర్మన్ సుదర్శన్ తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ బొడ్డు నారాయణ సైతం రాజీనామా కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే వారం క్రితం బారాసాకి చెందిన 18 మంది కౌన్సిలర్లు బస్సు లో శిబిరానికి తరలి వెళ్లారు. అప్పటినుండి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టించుకోవట్లేదు అని ఆరోపించారు. వాళ్ళందరూ కూడా రాజీనామా నిర్ణయానికి వచ్చారు శుక్రవారం అవిశ్వాస తీర్మానం పై సమావేశం జరగాలి. బెల్లంపల్లి లో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. వీళ్లల్లో ఒక వార్డ్ కౌన్సిలర్ గతంలో మృతి చెందారు ప్రస్తుతం కాంగ్రెస్ కి 11 మంది, భాజాపాకి ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు. బారాసకు చందు 21 మంది రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version