పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకి సంబంధించి కొత్త విషయం ఒకటి వెలుగు లోకి వచ్చింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి స్టార్ట్ అవుతాయని, ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతాయని సమాచారం. అలానే ఫిబ్రవరి 31న రాష్ట్రపతి ప్రసంగం తో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతాయని తెలుస్తోంది. ఆ తర్వాత ఆర్థిక సర్వే నివేదికని సమర్పించనున్నారు.
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ని ఫిబ్రవరి 1 న జనవరి 31 నుండి జరిగే బడ్జెట్ సెక్షన్ లో సమర్పిస్తారు. రాష్ట్రపతి ద్రౌపదీ జనవరి 31న బడ్జెట్ సమావేశాల ప్రారంభం తో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. తర్వాత ఆర్థిక సర్వే నివేదిక కూడా జనవరి 31న సమర్పిస్తారట. ఇది ఇలా ఉంటే మధ్యంతర బడ్జెట్లో రైతులకి కిసాన్ సమాన్ నిది ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని తెలుస్తోంది