ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు అందరూ జనతా కర్ఫ్యూని అవలంభిస్తున్నారు. మార్చి 22 న జనతా కర్ఫ్యూ కారణంగా ఆ రోజు రైళ్ళను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయించింది. మార్చి 21 న రాత్రి 10 గంటల నుంచి మార్చి 22 అర్థరాత్రి సమయంలో బయల్దేరే రైళ్లను నటపబోమని ప్రకటించింది..
అలాగే రద్దీలేని రైళ్లను ఆ రోజు నడపవద్దని అన్ని బోర్డులను ఆదేశించిన రైల్వేశాఖ.. రోజూ ఉ. 7 గంటలకు బయల్దేరే రైళ్ళు మాత్రం నడుస్తాయని తెలిపింది. ఇక ముంభై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, సికింద్రాబాద్ నగరాల్లో MMTS రైళ్ళను తగ్గించాలని నిర్ణయింది.
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.స్కూళ్లను, షాపింగ్ మాల్స్ ను, సినిమా హాళ్ళను మూసివేస్తూ ఆదేశాలు జారి చేశారు. కరోనా ప్రభావంతో ఐపీఎల్ లాంటి టోర్నీలు రద్దయ్యాయి. సినిమా షూటింగ్ లను కూడా వాయిదా వేస్తూ టాలివుడ్ ప్రముఖులు కూడా నిర్ణయం తీసుకున్నారు.