BREAKING : ప్రైవేట్ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు

-

BREAKING : తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కావేరి, గురునానక, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్ మార్ యూనివర్సిటీలో ఏర్పాటుకు అనుమతిస్తూ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అలాగే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలలో… తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ తీర్మానం చేసింది. అలాగే..దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు.

దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ నడుస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని ఆయన చెప్పారని వెల్లడించారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news