భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో కేంద్రం అప్రమత్తమవుతుంది. ఏ పరిస్థితి అయినా సరే ఎదుర్కోవడానికి కేంద్రం సిద్దమవుతుంది. దీనిపై ఇప్పటికే అలెర్ట్ ప్రకటించిన కేంద్ర సర్కార్… దేనిని ఎదుర్కోవడానికి అర్మీని రంగంలోకి దించాలని భావించింది. కరోనాను కట్టడి చేసేందుకు గాను త్రివిధ దళాలను రంగంలోకి దించడానికి కేంద్రం సర్వం సిద్దం చేస్తుంది. అవసరమైతే సేవలు అందించేందుకు సిద్దంగా ఉండాలని ఆర్మీకి సమాచారం అందించారు.
భారత్ లో 2,500 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తుంది. భవిష్యత్తులో కరోనా పెరిగితే వాళ్ళను ప్రజలకు దూరంగా తరలించడానికి కేంద్రం సర్వం సిద్దం చేస్తుంది. ప్రత్యేక వైద్య సేవలను అందించేందుకు వీలుగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ని రంగంలోకి దించడానికి రెడీ అయింది. ఇప్పటి వరకు భారత్ లో 5 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలో, హైదరాబాద్ లో ఒక్కో కేసు నమోదు అయింది.