షాకింగ్ : భార్యతో గొడవ, నాలుక కోసేసుకున్న వ్యక్తి

Join Our Community
follow manalokam on social media

యూపీలో ఒక దారుణ ఘటన జరిగింది. భార్యతో గొడవ పడీ పడీ, విసిగిపోయి తన నాలుక తానే కత్తిరించుకున్నాడు. గట్నకు సంబందిచిన వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో 27 ఏళ్ల వ్యక్తి తన నాలుకను కత్తిరించుకున్నాడు, అతను తన 24 ఏళ్ల భార్యతో తరచూ గొడవలు పడుతూ ఉండే వాడు, ఈ గొడవలతో కలత చెంది నాలుక కత్తిరించుకున్నాడని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం, గోపాల్పూర్ గ్రామంలో నివసిస్తున్న ముఖేష్, తన భార్య నిషాతో ఒక చిన్న విషయంలో గొడవ పడ్డాడు. గొడవ అవ్వడంతో నిషా అతన్ని తిట్టేసి పుట్టింటికి వెళ్ళింది.

దీంతో మొన్న ముఖేష్ నిషాకు ఫోన్ చేసి, అత్తారింటికి తిరిగి రమ్మని కోరాడు.దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆ కాల్ లో కూడా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కోపం పట్టలేని ముఖేష్ గొడవ పడుతూనే ఒక బ్లేడు తీసుకొని దానితో తన నాలుకను కత్తిరించుకున్నాడు. అతని ఏడుపు విన్న అతని కుటుంబ సభ్యులు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి చూడగా నాలుక కోసుకున్నట్లు తెలిసింది. బాగా రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి) కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, సిహెచ్‌సి వైద్యులు అతన్ని కాన్పూర్ నగరంలోని పెద్దాస్పత్రికి పంపారు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...