ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోన్‌భద్రలో భారీగా బంగారం గనులను గుర్తించారు అధికారులు. పురాతన శాస్త్రవేత్తలు గత 15 ఏళ్ళుగా సోన్‌భద్రలో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిశోధనల్లోనే అక్కడ ఎనిమిదేళ్ళ క్రితం, 2012లో అక్కడ బంగారు గనులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. భూగర్భంలో దాదాపు 3వేల టన్నుల బంగారం ఉందని అక్కడి అధికారులు ఒక అంచనా వేసారు.
ఇప్పుడు దాని కోసం ఒక వేలం ప్రక్రియను ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. 2005 సంవత్సరంలో జీఎస్‌ఐ బంగారం కోసం అన్వేషణ మొదలుపెట్టగా హార్ది ప్రాంతంలో 646.15 టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నాయని తేల్చారు. గోల్డ్ హిల్స్‌లో 2843.25 టన్నుల బంగారాన్ని అధికారులు గుర్తించడం విశేషం. ఇప్పుడు ఆ గనులను విక్రయించడానికి గానూ యుపీ ప్రభుత్వం చర్యలకు దిగింది.
ప్రభుత్వం నిర్వహించే ఈ టెండర్ ముందు ఏడుగురు సభ్యులతో ఒక పరిశోధన చేయనున్నారు. వీరు బంగారం ఉందని భావిస్తున్న ప్రాంతం మొత్తానికి జియో ట్యాగింగ్ చేసి, మరో రెండు రోజుల్లో ప్రభుత్వానికి దానికి సంబంధించిన నివేదిక అందిస్తున్నారు. ఇక బంగారం ఒక్కటే కాకుండా సోన్‌భద్రలో పొటాషియం, ఇనుము నిక్షేపాలు కూడా భారీగా ఉన్నాయని అలాగే వాటితో పాటుగా యురేనియం నిక్షేపాలు కూడా ఉన్నట్టు తేల్చారు.