మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే నీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హర్యానా లో కొన్ని పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తి అర్హత ఉన్న వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
దీనిలో మొత్తం 380 వాచ్ మెన్ పోస్టులు ఉన్నాయి. అప్లై చేసుకోవాలని అనుకునే వారు ఐదో తరగతి లేదా ఎనిమిదో తరగతి పాస్ అయి ఉండాలి. వయసు విషయానికి వస్తే సెప్టెంబరు 1, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకి రూ. 23,300 నుండి రూ. 64,000 వరకు జీతం ఇస్తారు. ఎంపిక విధానం గురించి చూస్తే… రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక పరీక్ష విధానం గురించి చూస్తే… ఈ పరీక్షని 120 మార్కులు కి మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బేసిక్ అర్థమెటిక్, జనరల్ నాలెడ్జ్ వంటి ప్రశ్నలు ఉంటాయి.
ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాషలలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 20 నుండి ప్రారంభం అవుతుంది. అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు నవంబర్ 19, 2021లో గా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసి 250 రూపాయలు. పూర్తి వివరాలని https://documents.fciharyana-watch-ward.in/notification లో చూసి అప్లై చేసుకోచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.