నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌లో 401 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగానికి చెందిన హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌ లోని ఫరీదాబాద్‌ లోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు.

401 ట్రైనీ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక ఎవరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేది చూస్తే బీఎస్సీ, బీఈ, బీటెక్‌, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సు ని పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకో వచ్చు. ఇక వయస్సు విషయానికి వస్తే.. వయసు జనవరి 25, 2023వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఇక శాలరీ విషయానికి వస్తే… నెలకు రూ.50,000ల నుంచి రూ.1,60,000ల వరకు చెల్లిస్తారు. పోస్టుల వివరాలని చూస్తే.. ట్రైనీ ఇంజినీర్ (సివిల్) పోస్టులు- 136, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టులు- 99, ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు- 41, ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు- 108, ట్రైనీ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌) పోస్టులు- 14, ట్రైనీ ఆఫీసర్ (లా) పోస్టులు- 3 వున్నాయి. పూర్తి వివరాలని http://www.nhpcindia.com/ లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version