ప్రస్తుత తరుణంలో జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఆడ, మగ అన్న తేడా లేకుండా చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఎవరికైనా జుట్టు రాలిపోయేందుకు పలు కారణాలు ఉంటాయి. కానీ కారణాలు ఏమున్నా కింద సూచించిన పలు ఆహార పదార్థాలను నిత్యం తీసుకుంటే దాంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే వెంట్రుకల సమస్యలు పోతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. మరి జుట్టు రాలడాన్ని తగ్గించే ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మరొక పోషక పదార్థమైన బయోటిన్ కూడా గుడ్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. అందువల్ల నిత్యం కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు.
2. పాలకూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, సిలు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తాయి. కనుక పాలకూరను తరచూ ఆహారంలో భాగం చేసుకున్నా జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు.
3. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకల సమస్యల నుంచి బయడ పడేస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. అందువల్ల వారంలో కనీసం 3 సార్లయినా చేపలను తింటే వెంట్రుకల సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. బాదం పప్పులో ఉండే బి విటమిన్లు, విటమిన్ ఎ, జింక్ వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతాయి. వీటిని నిత్యం తింటే జుట్టు రాలడం సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
5. అవిసె గింజలు, పొద్దు తిరుగుడ విత్తనాలను నిత్యం తింటున్న జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు. వీటిల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, జింక్, సెలీనియం వెంట్రుకల సంరక్షణకు తోడ్పడుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.