ఒకే పాత్రను వదులుకున్న 5 మంది హీరోయిన్స్..!!

-

ఎన్నో సంవత్సరాల తర్వాత మల్టీస్టారర్ గా వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈచిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ మహేష్ బాబు చిన్నోడు ,పెద్దోడు గా నటించి మెప్పించారు. ఈ చిత్రం 2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలై ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 54.75 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రస్తుతం ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా లభించింది.Watch Sabse Badhkar Hum 2 | Prime Video

అంతేకాకుండా ఈ సినిమాకి ఉత్తమ గీత రచయితగా కూడా సిరివెన్నెల కి, ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాష్ రాజ్ కి, ప్రత్యేక జ్యూరీ అవార్డు గా హీరోయిన్ అంజలి కి నంది అవార్డు అందుకున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ముఖ్యంగా సీత పాత్రకి సమంతని తీసుకోగా.. ఇక అంతకుముందు సినిమా వరకు చిన్మయి డబ్బింగ్ చెప్పేది. కానీ ఈ చిత్రం నుంచి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసింది.Heroine Anjali: ఆ హీరోయిన్స్ వల్ల నాకు అవకాశాలు పోలేదు.. అంజలి!– News18 Telugu

అయితే ఇందులో ప్రత్యేకమైన పాత్ర సీత. అయితే ఈ పాత్రలో అంజలి ఎంతో అద్భుతంగా నటించింది. అచ్చ తెలుగు అమ్మాయిలా నటించి ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా హీరోయిన్ త్రిష, భూమిక, స్నేహ, అనుష్క లను అనుకోగా.. చివరికి అమలాపాల్ ఓకే చెప్పింది. కానీ చివరి నిమిషంలో ఈమె ఎందుకో ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో అంజలి ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇక ఈ చిత్రాన్ని ముందుగా మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలనుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. కానీ చివరగా పవన్ ప్లేస్ లో వెంకటేష్ నటించాడు. అలాగే రేలంగి పాత్రలో హీరో రాజశేఖర్ ని అనుకో గా ప్రకాష్ రాజ్ ని ఫిక్స్ చేయవలసి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news