ఇండియాలో 70 శాతం మరణాలు ఆ రాష్ట్రాల్లోనివే !

-

దేశం మొత్తం మీదున్న మరణాల్లో 70% ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్రల నుండేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశంలో ఒక విడత సీరో సర్వే చేయగా ఇప్పుడు రెండవ విడత సీరో సర్వే మొత్తం దేశంలోని 70 జిల్లాలు ప్రారంభమైంది. రాబోయే రెండు వారాల్లో దీని ఫలితాలను రావచ్చని ఐసిఎంఆర్ డీజీ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.

ఇక వైద్యులకు ఎక్కువగా కరోనా సోకే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణా ఉండగా ఆ తరువాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, పుదుచ్చేరి, పంజాబ్ లు ఉన్నాయి. తెలంగాణలో వైద్య సిబ్బంది 18% మందికి కరోనా సోకితే, మహారాష్ట్రలో 16%, డిల్లీలో 14%, కర్ణాటకలో 13%, పుదుచ్చేరిలో 12% మరియు పంజాబ్లో 11% కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news