మరణించిన హిందు భర్త ఆస్తిపై వితంతువుకు పూర్తి హక్కు: బంగ్లాదేశ్ కోర్ట్

-

మరణించిన భర్తకు చెందిన అన్ని ఆస్తులలో హిందూ వితంతువులకు హక్కు ఉందని బంగ్లాదేశ్ హైకోర్టు ఒక మైలురాయి లాంటి తీర్పు ఇచ్చింది. ఇంతకు ముందు, హిందూ వితంతువులకు వారి భర్తకు చెందిన ఇంటి స్థలానికి మాత్రమే హక్కు ఉండే చట్టం ఉంది. జస్టిస్ మిఫ్తా ఉద్దీన్ చౌదరి సింగిల్ జడ్జి బెంచ్ నిన్న తీర్పును ప్రకటించింది. 2004 లో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ధృవీకరిస్తూ, వితంతువుకు తన భర్తకు చెందిన అన్ని ఆస్తులపై హక్కు ఉందని తీర్పు ఇచ్చింది.

బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ ఓక్య పరిషత్ ప్రధాన కార్యదర్శి రానా దాస్ గుప్తా ఈ తీర్పును ఒక మైలురాయి తీర్పుగా అభివర్ణించారు. అలాగే నిస్సహాయ హిందూ వితంతువులకు రక్షణగా ప్రశంసించారు. తన భర్త ఆస్తిపై స్త్రీకి వారసత్వ హక్కులు హిందూ మహిళల ఆస్తి హక్కుల చట్టం, 1937 ద్వారా మార్గనిర్దేశం చేసారు. ఇది హిందూ మహిళలకు వారి ఆస్తి హక్కులను తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news