కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం… ర్యాలీలు, రోడ్ షోల అనుమతులపై క్లారిటీ

-

కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక సమావేశం నిర్వహించనున్నాయి. ఇప్పటికే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఆ సమయంలో కోవిడ్ పెరుగుతున్న కారణంగా రోడ్ షోలు, ర్యాలీలకు పర్మిషన్ లేదని చెప్పింది. కాగా జనవరి 15 తరువాత ర్యాలీలు, రోడ్ షోలపై మళ్లీ సమీక్షిస్తామని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో రోడ్ షోలకు, ర్యాలీకు అనుమతి ఇస్తుందో లేదో చూడాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రతో పాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కూడా ఈ సమావేశానికి హాజరువతున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు కూడా ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొంటున్నారు. రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం పొడగింపు ఉంటుదా.. లేదా అనే విషయంపై చర్చించనున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ప్రారంభించాయి. అయితే కోవిడ్ కారణంగా ప్రచారానికి బ్రేకులు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version