పుష్ప 2 లో ఆ సీన్ కోసం రూ.50 కోట్లు..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టు సినిమాతో బిజీ గా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో వస్తున్న పుష్ప టు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. 2021 లో వచ్చిన బ్లాక్ బాస్టర్ పుష్ప కి సీక్వెల్ గా ఇది రాబోతోంది. ఇప్పటికే పుష్ప టు షూటింగ్ మొదలైపోయింది. ప్రస్తుతం సినీ ప్రియులు ఎంత గానో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్ అనసూయ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. పుష్ప టూ లో ఒక సీన్ కోసం ఏకంగా 50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. జాతర ఎపిసోడ్స్ ఉండబోతున్నాయట. దీనిలో భాగంగా బన్నీ అర్ధనారీశ్వరుడు గా కనపడతాడట అంతేకాకుండా జాతరలో ఒక డివోషనల్ సాంగ్ భారీ ఫైట్ కూడా ఉండబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news