ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు !

-

ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కానుంది. మొన్నటి వరకు… ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు పై కరాటే కళ్యాణి ఓ వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు లేదంటూ నానా రచ్చ చేసింది కరాటే కళ్యాణి.

తాజాగా ఖమ్మంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం నగరంలోని లకారం చెరువు మీద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని మొదట ఏర్పాట్లు చేయగా కోర్టు అనుమతి నిరాకరణతో నిర్వాహకులు దానిని లకారం ట్యాంక్ బండ్ సమీపంలోని ప్రైవేట్ స్థలంలోకి మార్చారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మరియు పలువురు ఎన్నారైల ఆర్థిక సహాయంతో నిర్మిస్తున్న ఈ విగ్రహాన్ని ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version