ఫిన్‌లాండ్‌కు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు నోకియా.. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంస్థల మధ్య 1 బిలియన్ డాలర్ల డీల్ కుదిరింది. ఈ రెండు కంపెనీల మధ్య ఈ డీల్ పలు సంవత్సరాలు కొనసాగనుంది. ఇందులో భాగంగా నోకియా 2022 వరకు భారత్‌లో విస్తృతంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌టెల్‌కు సహకారం అందించనుంది.
2022 వరకు భారత్‌లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నోకియా, ఎయిర్‌టెల్‌లు కలిసి పనిచేయనున్నాయి. ఈ క్రమంలో కొత్త టవర్ల ఏర్పాటుతో భారత్‌లో ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 5జి సేవలను త్వరగా అందించేందుకు మార్గం మరింత సులభతరం కానుంది. కాగా టెలికాం మార్కెట్లలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో మరో 5 సంవత్సరాల కాలంలో కొత్తగా 920 మిలియన్ల మంది మొబైల్ కస్టమర్లు పెరుగుతారని తెలుస్తోంది. దీంతో ఆ మార్కెట్‌ను చేజిక్కించుకునేందుకు గాను నోకియా.. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం అయ్యింది.
ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం అవడం ద్వారా నోకియా.. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫోన్లను తయారు చేసి అందించేందుకు వీలు కలుగుతుంది. అదే 5జి ఫోన్లను ప్రవేశపెట్టడం మరింత సులభతరం అవుతుంది. అందుకనే నోకియా.. ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం అయ్యింది..!