తెలంగాణ సాంప్రదాయాలకు చిహ్నంగా బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు..ఈ ఏడాది కూడా ఘనంగా బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి.. బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.. చివరి రోజు సద్దుల బతుకమ్మ..ఆడ పడుచులు అంతా కలిసి బతుకమ్మ సంబరాలు జరిపి గౌరమ్మను నిమర్జనం చేస్తారు.. ఏ రోజు ఏ బతుకమ్మను తయారు చేస్తారంటే… 1) ఎంగిలి పూల బతుకమ్మ 2) అటుకుల బతుకమ్మ, 3) ముద్దపప్పు బతుకమ్మ 4) నానే బియ్యం బతుకమ్మ 5) అట్ల బతుకమ్మ..6) అలిగిన బతుకమ్మ.. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు. 7) వేపకాయల బతుకమ్మ.. 8) వెన్నముద్దల బతుకమ్మ.. 9) సద్దుల బతుకమ్మ..
ఆటపాటలతో బతుకమ్మ ఆడి, తర్వాత చెరువులో వదులుతారు. బతుకమ్మ పండుగలో ఐదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజు తంగేడు, గునుగు, చామంతి, మందారం, గుమ్మడి పూలను అందంగా పేర్చి బతుకమ్మ తయారుచేస్తారు. వాయనంగా అట్లు పెడతారు. బతుకమ్మను నిమజ్జనం చేశాక, అట్లను ఆడపడుచులంతా పంచుకుంటారు..
కావలసిన పదార్థాలు..
బియ్యప్పిండి- ఒక కప్పు,
రవ్వ- అర కప్పు,
జీలకర్ర- కొద్దిగా, పెరుగు- పావు కప్పు
తయారీ విధానం..
ఒక గిన్నెలో బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, పెరుగు వేయాలి. నీళ్లు పోస్తూ దోసెపిండి కంటే కొంచెం పలుచగా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత పెనం వేడిచేసి కొంచెం నూనె పూసి దానిపై పిండిని దోసెలా పోయాలి. నూనె వేసి రెండు వైపులా కాలిస్తే అట్ల బతుకమ్మ ప్రసాదం రెడీ..