అవార్డులు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణ కు నిధులు ఎందుకు ఇవ్వదు ? – హరీష్ రావు

-

అవార్డులు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణ కు నిధులు ఎందుకు ఇవ్వదు ? అని నిలదీశారు హరీష్ రావు. రెండు రోజులకు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు…తెలంగాణ సర్కార్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. మిషన్ భగీరథ కు అవార్డుతో అయిన కేంద్ర మంత్రులకు కనువిప్పు కలగాలని చురకలు అంటించారు.

తెలంగాణ రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొట్టి అమలు చేస్తుంది…సంతోషమన్నారు. ఒకరు పాదయాత్ర ,మరొకరు మోకాళ్ల యాత్ర చేస్తున్నారు …ఎవరైనా ప్రజలు నీటి సమస్యను తీసుకువచ్చారా ? అని నిలదీశారు. మిషన్ భగీరథ కు 20,30 అవార్డులు వచ్చాయి.. దేశానికి తెలంగాణ మాడల్ అయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు.

కేంద్రం ఢిల్లీలో అవార్డులు ఇస్తుంది.. కేంద్ర మంత్రులు గల్లీలో అవాక్కులు మాట్లాడతారని వెల్లడించారు. మిషన్ భగీరథ కు 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పింది …కానీ 19 పైసలు ఇవ్వలేదు.. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథ నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వాలని కేంద్రం కు సిపారసు చేసిందని వెల్లడించారు. కానీ కేంద్రం 15 వ ఆర్థిక సంఘం సిఫారసులను పక్కన బెట్టిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version