సీతక్క పై సీఎం కేసీఆర్ ఫైర్… ఇలా మాట్లాడితే కుదరదు !

-

మూడు రోజుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సందర్భంగా ములుగు ఎమ్యెల్యే సీతక్క.. టిఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీ నిధులపై సీతక్క మండిపడ్డారు. గ్రామ పంచాయితీ ల గురించి మాట్లాడితే టిఆర్ఎస్ నాయకులు ఉలిక్కి పడుతున్నారు ఎందుకు ? అని ప్రశ్నించారు. “మాకు మీ అంతా తెలివి తేటలు లేవు. ఇంతకు ముందు ఎప్పుడూ సభలో ప్రశ్నలకు మినహాయించి మాట్లాడలే దా..? అని నిలదీశారు. ఆహా..ఓహో అంటే మైక్ ఇస్తారు.. ప్రశ్నించే గొంతుకను నొక్కడ మే కదా.. మీ పని..? అని ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.

cm kcr | సీఎం కేసీఆర్

అయితే ఎమ్యెల్యే సీతక్కకు సిఎం కెసిఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ లో ఏది పడితే అది మాట్లాడటం సరి కాదని.. ఇక్కడ అలా మాట్లాడితే కుదరదని మండిపడ్డారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం అంటే ఎట్లా ? తల ఎత్తుకుని పని చేస్తున్న సర్పంచ్ లు తెలంగాణ సర్పంచ్ లేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయం లో తలసరి వెచ్చించిన నిధులు 4 రూపాయలు అని.. తాము వెచ్చిస్తున్న నిధులు 680 రూపాయలు అని పేర్కొన్నారు. ఎవరి గొంతు నొక్కుతున్నారని.. మీరు చెప్పేది మీరు..మేము చెప్పేది మేము చెప్తామన్నారు.

అభివృద్ది పై జనం నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడి పరిస్థితులపై సంతోష పడుతున్నారని ఎమ్యెల్యే సీతక్కకు చురకలు అంటించారు.కేంద్రం ఇచ్చే నిధులు మళ్లింపు అంటే… నవ్వాలా ? కేంద్రం ఇచ్చే నిధులు ఉండవన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి ఏంటన్నది ఒకటి, రెండు రోజుల్లో సభలో చెప్తామని వెల్లడించారు. సభకు వచ్చే నిధులు ఏంది అనేది చర్చకు పెడతామని.. కేంద్రం దయా తో నిధులు ఇవ్వడం కాదు.. అది రాష్ట్రాల హక్కు అన్నారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version