70 ఏళ్లలో తొలిసారి గద్దర్..

-


ప్రజా యుద్ధనౌక గద్దర్ తన 70 ఏళ్లలో తొలిసారిగా ఓటు వేశారు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్‌ వెంకటాపురం పోలింగ్ కేంద్రంలో గద్దర్ తన సతీమణితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితులైన గద్దర్ నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకు నమ్మకం లేకపోవడంతో ఇన్నేళ్లు ఓటుకు దూరంగా ఉన్నారు.

దేశ కోసం, దేశం భవిష్యత్ కోసం సేవ్ నేషన్ అనే నినాధంతో ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించనున్న సందర్భంగా తాను నేడు తొలి సారి ఓటు వేశారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏ పార్టీతో సంబంధం లేకుండా తాను ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కూడా ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని.. దాన్ని సరిగి వినియోగించుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో గద్దర్ ప్రజా కూటమి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news